Header Banner

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి... గెలుపెవరిది? ఫలితాల కోసం ఉత్కంఠ!

  Thu Feb 27, 2025 19:03        Politics

తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు స్థానాలకు.. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ వద్ద ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మార్చి 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసే నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 65.43 శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


దీంతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో 87.30 శాతం పోలింగ్ నమోదు అయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి ఎన్టీఆర్ జిల్లాలో 61.99 శాతం నమోదు అయింది. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 90 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. పెద్దపల్లిలో అత్యధికంగా 77.95 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు వెల్లడించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లను తరలించి... గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో వైసీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీ ప్రధానంగా పోటీలో నిలిచింది. ఇక తెలంగాణలో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో బరిలో నిలవగా.. బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం గులాబీ నేతలను ఆందోళనకు గురి చేసింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!



ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #elections #mlcelections #todaynews #flashnews #latestnews